
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, (అల్లూరి జిల్లా) జిల్లా ఇంచార్జ్ : బడ్జెట్ లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం
- ఎస్టీ సబ్ ప్లాన్ కు 17వేల కోట్లు కేటాయించాలి.
- ప్రభుత్వం కేటాయింపు కేవలం 2.48 శాతమే.
- ఐ టి డి ఏ లకు 100కోట్లు తో అరకొర కేటాయింపులే.
- పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం
- ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నియామకానికి బడ్జెట్ లో లేదు.
- జీ సి సి అభివృద్ధికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి.
- ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి 10వేల కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం లో తీవ్రమైన అన్యాయం జరిగింది. దామాషా ప్రకారం 5.53 శాతం నిధులు కేటాయించాలి.కానీ కేవలం 2.48శాతం మాత్రమే కేటాయించి, గొప్పలు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు, పి. అప్పల నరస తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విలేఖర్లతో పి.అప్పల నరస మాట్లాడుతూ 3.22 లక్షల రూపాయల్లో ఎస్టీ సబ్ ప్లాన్ కు 5.53శాతం నిధులు కేటాయించలేదు. 275 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలకు, ఎనిమిది ఐ .టి.డి. ఏ లా ద్వారా పాలన జరుగుతుందని,వాటికి కేవలం 100కోట్లు కేటాయించి ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోంది. ప్రతి ఐ.టి.డి. ఏ లకు 100కోట్లు రూపాయిల చొప్పున కేటాయించాలని, డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ధరలు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు కోరిన పట్టించుకోలేదని అటవీ,వ్యవసాయ ,మరియు కాపీ ఉత్పత్తులకు కొనుగోలు కోసం, జి.సి.సి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం కేటాయించిన 20 లక్షల రూపాయలు ఎటుసరిపోదని అన్నారు. ఈ ఏడాది కూడా కాఫీ రైతులకు సకాలంలో గిట్టుబాటు ధరను జి.సి.సి కల్పించక పోవడంతో ఇప్పటికీ జి.సి.సి టార్గెట్ తగ్గటుగా కాఫీ పంట సేకరణ జరగలేదు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నియామకానికి, నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ గురించి కూడ బడ్జెట్ లో కనీసం ప్రస్తావన చేయలేదు.
గిరిజన గురుకులం లో విధులు నిర్వర్తిస్తున్న ఆదివాసీ అధ్యాపక,ఉపాద్యాయ లకు రెగ్యులైజేషన్ చేయడానికి కూడా నిధులు కేటాయింపు లేదు.
గిరిజన సంక్షేమానికి గత బడ్జెట్ లో 4,561 కోట్లు కేటాయించి, మళ్ళీ సవరించి 129 కోట్ల రూపాయల ను తగ్గించారు. ప్రస్తుత బడ్జెట్ లో 4671 కోట్లు రూపాయిలు కేటాయించిన, సవరణ బడ్జెట్ వచ్చేసరికి మరింత తగ్గించే అవకాశం ఉందని అన్నారు. గిరిజన విద్యకి గతంలో 948 కోట్లు కేటాయించి, 3కోట్ల రూపాయల తగ్గించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్ షిప్, మెస్ ఛార్జీలు పెంచితే,హెల్త్ అసిస్టెంట్ నియామకం చేపట్టేందుకు నిధులు కేటాయిస్తే తప్ప విద్యార్థుల మరణాలు నివారించడం సాధ్యం కాదని తెలిపారు. ట్రైకర్ కు 696కోట్లు కేటాయించారని, కానీ గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలు వైపు అడుగులు వేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన, వ్యాపారానికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1424 కోట్లు రూపాయిలతో సమస్యలు పరిష్కారం కాదని 18వేల కోట్ల రూపాయల కేటాయించాలి అన్నారు.
అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. త్రాగు నీరు,డోలి మోత మొదలగు సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.అందుకు 10వేల కోట్ల రూపాయల అదనంగా కేటాయించాలని, పి. అప్పలనరస డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
