TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులోఉన్నాయని రైతులకు తెలియజేయడం జరుగుతోంది యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమగుతుందని ప్రణాళికలు తాయారు చేయడం జరిగింది. సరఫరాకోసం అన్నిమండలాల్లో సమగ్రచర్యలు చేపట్టాం. మార్కెఫెడ్ ద్వారా యూరియా నిల్వలను పాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అరస్క్ వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు డీసీమ్స్ జిల్లా కోపెరేటివ్మార్కెటింగ్సొసైటీనే మరియు ఫపోస్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లాలో నిన్నటి అమ్మకాలు పూర్తవగా మండలాల వారీగా జిల్లాలోయూరియా నిల్వలు

మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో 3323 ఎంత యూరియా అందుబాటులో ఉంది రైతులు గమనించవలిసింది ఏమనగా యూరియా వాడకం ఎక్కువైతే అగ్గితీగెలు సోకె ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా వాడవలిసిందిగా కోరడమయినది.
ప్రతి మండలంలో సొసైటీలు మరియు ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వలను అందుబాటులోఉంచడమే కాకుండా, సకాలంలో సరఫరా కొనసాగించేందుకు జిల్లా యంత్రాగం కూడా తరచుగా జిల్లాకు యూరియా కేటాయింపుల కోసం వ్యవసాయ శాఖా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యాసంగి అనగా 01.10.2024 నుండి 14.02.2025 వరకు 30201 మాట్స్ యూరియా మన జిల్లాకు రావడం జరిగింది.
యూరియా సరఫరా అనేది నెల సప్లై ప్లాన్ ప్రకారం ప్రతి రోజు సరఫరా ఉంటుంది. క్రిభకో రఫకల్ మరియు నబీసీల్ యూరియా మొత్తం 2500 టన్నులు యూరియా ఈ వారంలో జిల్లాకు రావడం జరిగింది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరంలేదు. జిల్లా యంత్రాగం మరియు జిల్లా వ్యవసాయశాఖ యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ మండలవ్యవసాయఅధికారిని సంప్రదించవచ్చు. యూరియా నిల్వలు అవసరాలకు పూర్తిగా సరిపడే విధంగా సన్నద్ధంగా ఉన్నాయి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 14 at 17.05.19
WhatsApp Image 2025 02 14 at 17.05.19