
Additional Collector GV Shyam Prasad Lal said pending land issues should be resolved in time
అంతర్గాం , ఆగస్టు-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలోని పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అంతర్గాం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మొగల్ పహాడ్ గ్రామంలోని భూ సమస్యలు, సర్వే సమస్యల గురించి గ్రామస్థులతో చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో అంతర్గాం మండల తహసిల్దార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
