Additional Collector G.V.Shyam Prasad Lal should pay special attention to the completion of land acquisition of National Highway
మంథని , ఆగస్టు-14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మంథని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో జాతీయ రహదారి కోసం చేపట్టాల్సిన ,భూసేకరణ, పెండింగ్ ధరణి సమస్యలు , వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మండలంలో
వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని, సంబంధిత రైతులు కలెక్టర్ వద్దకు ఆర్బిట్రేషన్ వచ్చే విధంగా చూడాలని, భూ సేకరణ పూర్తిచేసిన భూమిని వెంటనే జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.
పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో మంథని మండల తహసిల్దార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App