సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ప్రత్యేక అభినందనలు అదనపు కలెక్టర్ డి.వేణు
*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అదనపు కలెక్టర్
పెద్దపల్లి, జనవరి- 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులను అదనపు కలెక్టర్ డి.వేణు ప్రత్యేకంగా అభినందించారు.
ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో
అదనపు కలెక్టర్ డి.వేణు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నారులు నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని, ఈ ప్రదర్శనల కోసం కృషి చేసిన ప్రతి చిన్నారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సాంస్కృతిక సారధి కళాకారుల సైతం జైసభక్తి గేయాలను పాడే వీక్షకులలో ఉత్సాహం నింపారని అదనపు కలెక్టర్ అభినందించారు.
*అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన ఆట పాటలు , సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల, గట్టెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దకాల్వల నోబల్ స్కూల్ విద్యార్థినులు దేశ భక్తి గేయాల మీద చేసిన ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేసాయి. హమ్ ఇండియా వాలే గేయం పై పెద్దపల్లి మహాత్మా జ్యోతి భా పూలె గురుకుల విద్యార్థినులు,రంగీలా గేయం పై పెద్దపల్లి గీతాంజలి పాఠశాల విద్యార్థినులు ఇదే మన భారతం గేయం పై పెద్దపల్లి గాయత్రి స్కూల్ విద్యార్థినులు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆసాంతం దేశ భక్తి గేయాలను పాడుతూ వీక్షకుల లో ఎప్పటికప్పుడు జోష్ నింపారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులు, సాంస్కృతిక సారధి కళాకారులకు అదనప కలెక్టర్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ, కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App