జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత
Trinethram News : జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15
జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటి స్తున్నారు. ధరూర్ బైపాస్ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.
పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్ వద్ద ఉన్న అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళల తో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జగి త్యాల అంటేనే బీఆర్‌ఎస్ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలం గాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని, మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు.
ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App