TRINETHRAM NEWS

నేనేమీ పారిపోలేదు.. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చానంతే: నటి కస్తూరి

అరెస్టుకు ముందు వీడియో విడుదల చేసిన కస్తూరి

రోజూ షూటింగ్‌కు వెళ్లి వస్తున్నానన్న నటి

పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడి

ఈ నెల 29 వరకు రిమాండ్‌ విధించిన న్యాయస్థానం
పుళల్ జైలుకు తరలించిన పోలీసులు
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన తమిళ నటి కస్తూరి అంతకుముందు ఓ వీడియోను విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానెక్కడికీ పారిపోలేదని, ఎలాంటి భయం లేదని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజూ షూటింగ్‌కు వెళ్లి వస్తున్నానని, తన సెల్‌ఫోన్‌ను న్యాయవాదికి ఇచ్చానని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ వీడియోలో కస్తూరి పేర్కొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App