TRINETHRAM NEWS

లీజ్ క్వారీల హద్దులు ప్రకటించాలి

ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను సీజ్ చేయాలి

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

కొండపల్లి పారిశ్రామిక కాలుష్యం మరియు వీటీపీఎస్ నుండి వెలువడే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలి

సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్

Trinethram News : పరిశ్రమలు వారిలలో భద్రతను పర్యవేక్షించాల్సిన ఘనులు పరిశ్రమల కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగడం వలన కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక బాడలోని పరిశ్రమలు మరియు వీటి పి ఎస్ కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న అధికారులు నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గోనేపూడి శంకర్ విమర్శించారు ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ ను వెంటనే సీజ్ చేయాలని కంచికచర్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు కొండపల్లి పారిశ్రామిక కాలుష్యంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ధోనేపూడి శంకర్ మాట్లాడుతూ..

ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఏంటి తీసి పరిటాల వారి ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కార్మికులు అసువులు బాయడం పై ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన తండాలకు చెందిన అతి నిరుపేదలో పొట్టకూటికోసం పోరుగు రాష్ట్రాలనుంచి వచ్చిన వారు ప్రాణాలు పణంగా పెట్టి క్వారీ లలో పనిచేస్తున్నారని ఎండనక వాననక బండ రాళ్లు దుమ్ము ధూళి మధ్య కుటుంబాలను దూరంగా పనిచేస్తున్న కార్మికుల శ్రమను పెత్తందారులు దోచుకుంటున్నారని విమర్శించారు కనీస రక్షణ కవచాలైన గ్లాసులు హెల్మెట్లు బూట్లు కూడా ఇవ్వకుండా ప్రమాదకరమైన పనిని చేయిస్తున్నారని నాసిరకమైన జిలిటేన్ స్టిక్స్ ఇచ్చి కొండను పగుల కొట్టిస్తున్న సందర్భంలో కొన్నిసార్లు కార్మికులు ప్రాణాలు బండ రాళ్లు మధ్య తెల్లారిపోతున్నాయని పేర్కొన్నారు ఇన్సూరెన్స్ ఈఎస్ఐ వంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.

300 ఎకరాలలో ఉన్న క్వారీలపై వేలాదిమంది ఆధారపడి ఉన్నారని ప్రభుత్వం 99 క్వారీలకు అనుమతి ఇచ్చిందని అదనంగా మరో 50 క్వారీలు అనధికారికంగా నడుస్తున్న ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని ధ్వజమెత్తారు అధికారులు మామూలు మత్తులో జోకుతూ పరిశ్రమల పర్యవేక్షణకు గాలికి వదిలేసారని విమర్శించారు.

కమిషనర్ ఆఫ్ ఎంప్లాయిస్ కాంపౌండ్ స్టేషన్ ఆక్ట్ నిర్దేశించినట్లుగా క్వారీలో చనిపోయిన వయసు మేరకు నష్టపరిహారం చెల్లించాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశించి వారాలు దాటుతున్న కూడా ఇప్పటికీ బాధితులకు ఇంకా నష్టపరిహారం అందించలేదని ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి మృతుల కుటుంబాలకు 50 లక్షలు చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వెలుగోడుతున్న వ్యర్ధాలు బూడిద కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పాడవుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే మాములుగా అలవాటపడి పర్యవేక్షణ చేయడం లేదని తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.