TRINETHRAM NEWS

స్వేరోస్ ఇంటర్నేషనల్, ABSF ఆధ్వర్యంలో పరకాల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ చేసిన ఏసీపీ సతీష్ బాబు

పరకాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పరకాల పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు చలి తీవ్రత ఎక్కువ అవడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్ధినుల సమస్యలను తెలుసుకొన్న స్వేరోస్ ఇంటర్నేషనల్ ,అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బోట్ల నరేష్ లు స్పూర్తి స్వచ్ఛంద సంస్థ, మరియు షైన్ విద్యాసంస్థల చైర్మన్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడానికి ముందుకు రావడం జరిగింది

ముఖ్య అతిథిగా వచ్చిన పరకాల ఏసిపి సతీష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సామాజిక మాద్యమాలకు దూరంగా ఉంటూ విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీరించి అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునే దిశగా ప్రయాణం కొనసాగించాలని అన్నారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ విద్యార్థుల అవసరాల కోసం తన వంతుగా ప్రతి నెల 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ శనిగరపు సాంబయ్య ,మంద మనోజ్, శనిగరపు సాజన్,దొగ్గేలా వినయ్,బొచ్చు రాజు , సతీష్ ,హాస్టల్ సంక్షేమ అధికారి ప్రశాంతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App