
రాష్ట్ర స్థాయి కరాటే & కుంగ్ ఫూ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ఫిబ్రవరి-19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలలో జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన కనబరిచారని వీరిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఫిబ్రవరి 16న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ & కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పెద్దపల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు
రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ 2025 పోటీలకు 12 జిల్లాల నుంచి 1000 మందికిపైగా విద్యార్థిని విద్యార్థులు వచ్చి పోటీలలో పాల్గొన్నారని, మన గోదావరిఖని కు చెందిన 20 మంది విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ ఎం.రాజేశం ఆధ్వర్యంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. వివిధ కేటగిరీలలో 10 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు సాధించారని అన్నారు
రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థినులకు కరాటే, కుంగ్ ఫూ, పై శిక్షణ అందించిన మాస్టర్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కరాటే కుంగ్ ఫు మాస్టర్ ఎం.రాజేశం , విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
