ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Acharya Sinare Jayanti

Acharya Sinare Jayanti : దేవరకొండ దుర్గం జులై 29, త్రినేత్రం న్యూస్ : మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ సాహిత్యాన్ని విద్యార్థులందరూ చదవాలని సాహిత్యం ద్వారా మనం ఎన్నో ఉన్నతమైన విలువలను నేర్చుకుంటామని పేర్కొన్నారు. అలాగే సినారె సాహిత్యంలోని అంశాల్ని సమాజానికి అన్వయిస్తూ అనేక విషయాల పైన మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ & తెలుగు విభాగాధిపతి జి.కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, డా. వి. మకట్లాల్, తెలుగు అధ్యాపకులు ఏ.శ్రీను తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page