TRINETHRAM NEWS

గతుకుల మాయ రోడ్లతో తరచూ ప్రమాదాలు సకాలంలో చేరుకోలేని అత్యవసర సేవలు. ప్రభుత్వం వెంటనే రోడ్లు వేయాలి, దాకోడు పంచాయతీ జాజిపాలెం మహిళలు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అడ్డతీగల మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్: గతుకులమయ రోడ్లతో తరచూ ప్రమాదాలు సకాలంలో చేరుకోలేని అత్యవసర సేవలు.

ప్రభుత్వం వెంటనే రోడ్లు వేయాలి దాకోడు పంచాయతీ, జాజిపాలెం మహిళలు.

సొంతనిధులతో రహదారి గుంతలు పూడ్చుతున్న దాకోడు గ్రామస్తులు.

అడ్డతీగల మండలం, దాకోడు రహదారి అడుగడుగున గుంతల మయం కావడంతో, తరచూ ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని, అత్యవసర సేవలు వేల సకాలంలో చేరుకోలేక ఇటీవల జాజి పాలెం గ్రామానికి చెందిన, ఒక గర్భిణీ ప్రసవ కాలంలో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో తల్లి, పిల్ల మరణించడం జరిగిందని, జాజిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి దాకోడి నుంచి అడ్డతీగల వెళ్లే మార్గం పనులు చేయించాలని, డిమాండ్ చేశారు. సామాజిక బాధ్యతతో గుంతలమయమైన దాకోడు రోడ్డును గ్రామానికి చెందిన, కొంతమంది యువకులు సొంత నిధులతో జెసిపి పెట్టి, గుంతలు పూడ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. మారేడుమిల్లి రంపచోడవరం అడ్డతీగల, కొయ్యూరు మండలం, నుండి జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవాలంటే ఇదే రహదారి కావడం శిధిలావస్థలో ఉన్న ఈ మార్గం గుండ ప్రయాణం నరకప్రాయంగా ఉన్నట్లు స్థానికులు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని దాకోడు జాజిపాలెం గ్రామానికి చెందిన పల్లాల కొండమ్మ, అల్లాడి లక్ష్మి, అల్లాడి నాగేశ్వరరావు ,దాకోడు గ్రామానికి చెందిన వంతల సత్తిబాబు, వడబం ఎండయ్య, బాలాజీ కన్నబాబు, పోయగల నారాయణ, కొలికెల లక్ష్మణరావు వడ్లోబు పెద్దబాబు తదితరులు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App