TRINETHRAM NEWS

కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య

తోటి విద్యార్థి వేధింపులే కారణమని పేరెంట్స్ పోలీసులకు పిర్యాదు

కరీంనగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆర్తీ సాహు పెరెంట్స్ పోలీసులకు పిర్యాదు చేశారు హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సాహు కూతురు ఆర్తీ సాహు ప్రతిమ మెడికల్ కళాశాలలో పిజీ సెకండియర్ పల్మనాలోజి చదువుతున్నారు. జనవరి 30న హాస్టల్ రూమ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమ కూతురు ఆత్మహత్యకు తోటి వైద్య విద్యార్థి ఆశిష్ కారణమని ఆర్తీ సాహు తండ్రీ రాజేంద్ర సాహు పోలీసులకు పిర్యాదు చేశారు. రెండు మాసాల క్రితం చెంపమీద కొట్టాడని తమ కూతురు చెప్పిందని పిర్యాదు లో పేర్కొన్నారు.

జనవరి 28న తోటి వైద్య విద్యార్థులు అశీష్ ఇంటికి వెళ్ళగా తన కూతురు వెళ్ళకపోవడంతో తమ ఇంటికి ఎందుకు రాలేదని ఆర్తీ సాహు ను ఆశిష్ కోప్పడడంతో 29న ఒంటరిగా ఆశిష్ ఇంటికి వెళ్ళి హాస్టల్ కు తిరిగొచ్చి మరుసటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.‌ డాక్టర్ ఆశిష్ పై అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App