TRINETHRAM NEWS

విషాదం.. అమెరికాలో విజయవాడ యువతి మృతి

అమెరికాలో విజయవాడకు చెందిన యువతి మృతి చెందింది.

కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూశారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.

బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో డ్రైవర్‌తో పాటూ నాజ్ కూడా స్పృహ తప్పారు.

ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.