ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ముత్తారం త్రినేత్రం న్యూస్
ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన కూరాకుల సాయికుమార్ 22 సంవత్సరాలు అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తు గత మూడు సంవత్సరాల నుండి ప్రయత్నిస్తుండగా ఉద్యోగం రాకపోయేసరికి మనస్థాపానికి గురై ఈ నెల 16వ తారీకు రోజున 8:30 నిమిషాలకు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి 9గంటలకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి నేను పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగిన అని తండ్రి సమ్మయ్య కు చెప్పగా అతను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకువెళ్లి చికిత్స పొందుతూ 20వ తారీకు రోజున రాత్రి7:20 నిమిషములకు చనిపోయాడని కుటుంబ సభ్యులు తేల్పారు.పోస్టుమార్టం చేసి తన స్వగ్రామమైన లక్కారం గ్రామానికి తరలిస్తున్నామని తన తండ్రి అయిన కూరాకుల సమ్మయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన సమాచారం మేరకు నా కొడుకు ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారని మాకు ఎవరి మీద అనుమానాలు లేవని నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగాలు రాక మనస్థాపానికి గురై పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తారం ఏస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App