TRINETHRAM NEWS

జిల్లా ఎస్పీ. కె.నారాయణ రెడ్డి, IPS. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-IV ఫలితాల ద్వారా పోలీస్ శాఖలో నేరుగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో 6 వారాల “బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్” నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా, ఈరోజు 71 మంది ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ అధికారులు DPO, వికారాబాద్‌ను సందర్శించి, DPOలోని ఏ సెక్షన్, పే సెక్షన్, బడ్జెట్ సెక్షన్, ప్రజా వినతుల పరిష్కార విధానాలు మరియు వివిధ విభాగాల మధ్య సమన్వయం మొదలైన అంశాలపై అధికారులతో శిక్షణ పొందారు.
“బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్”కు వచ్చిన జూనియర్ అసిస్టెంట్ అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, IPS గారు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, “పోలీస్ శాఖలో పరిపాలనా విభాగం కీలకమైనది. మీరు సాంకేతిక పరిజ్ఞానం, నూతన విధానాలను అవలంబించి, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలి. పోలీస్ శాఖలో సేవలు అందించేందుకు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమర్థత ఎంతో ముఖ్యం. పోలీస్ సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా, సత్వర సేవలు అందించేందుకు కృషి చేయాలి” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసే విధంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే, ట్రైనీలు తమకు కలిగిన సందేహాలను అధికారులతో చర్చించి, పోలీస్ పరిపాలనలోని నైపుణ్యాలను మెరుగుపరచుకునేలా శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ టి.వి. హనుమంత్ రావు గారు, RBVRR DSP భాస్కర్ గారు, వికారాబాద్ AR DSP వీరేష్ గారు, బి సెక్షన్ సూపరింటెండెంట్ మోహనప్ప, పే సెక్షన్ సూపరింటెండెంట్ మీర్జా జావిద్ బేగ్, RI డేవిడ్ విజయ్ గారు, RSIలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

K. Narayana Reddy