TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 17
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు.

ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్ రిలీజ్ చేశారు.

గత పది హేను రోజులుగా ఆయన పార్టీ మారుతున్న విషయం తీవ్ర చర్చనీ యాంశం కాగా.. బీఆర్ఎస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

కానీ ఆయన మాత్రం ఓ వైపు బీఆర్ఎస్ నేతలతో కాంప్రమైజ్ అవుతూనే మరోవైపు తన ప్రయత్నాలు తాను చేశారు.

కాగా శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అరూరి ఆదివారం అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.