TRINETHRAM NEWS

A preparatory meeting was held on the procurement of grain for the monsoon season 2024-25, which will begin soon

జిల్లా అదనపు కలెక్టర్.శ్యామ్ ప్రసాద్ లాల్
తేది 31.08.2024 రోజున త్వరలో ప్రారంభం కానున్న వానాకాలం 2024-25 ధాన్యం కొనుగోళ్ళ పై సన్నాహక సమావేశం నిర్వహించినారు.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంబించుటకు కావలసిన అన్ని ఏర్పాటులను త్వరగా పూర్తి చేయాలని సంబందిత విభాగాల అధికారులను ఆదేశించినారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక సదుపాయాలు ఉండేటట్లుగా చూసుకోవాలని మరియు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు లోబడి కొనుగోళ్ళు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్(సివిల్ సప్ప్లైస్) నుండి కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితులలో కేటాయించని రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయరాదని అలా చేసిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపినారు.

రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఏ రోజువి ఆ రోజే కొనుగోలు పుస్తకంలో నమోదు చేయాలని మరియు ఎప్పటికప్పుడు ఆన్లైన్ OPMS లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.
రైస్ మిల్లర్లు లారీల దిగుమతి విషయంలో ఎలాంటి జాప్యం జరుగకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని, దిగుమతి అయిన వెంటనే ఆన్లైన్ OPMS లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించినారు.
రవాణా కాంట్రాక్టర్ లు ప్రతి కొనుగోలు కేంద్రానికి అవసరానికి సరిపడా ధాన్యం రవాణా వాహనాలను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

ఇట్టి సమావేశములో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి మరియు జిల్లా మార్కెటింగ్ అధికారి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A preparatory meeting was held on the procurement of grain for the monsoon season 2024-25, which will begin soon