
Trinethram News : జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపూ భూకంప తీవ్రత 6.1గా నమోదైట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:55 గంటలకు పలుచోట్ల భూమి కంపించింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని USGS తెలిపింది.
ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. సునామీ వచ్చే అవకాశం లేదని తెలపడంతో ఆ దీవులలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” లో ఉన్న కారణంగా ఇండోయేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే చర్యలతో ఇండోనేషియా ద్వీపాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
