TRINETHRAM NEWS

జర్నలిస్టులపై దాడి కేసులో ఆసుపత్రి యాజమాన్యం పై కూడా కేసు నమోదు చెయ్యాలి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

Trinethram News : Medchal : మల్లారెడ్డి ఆసుపత్రిలో శనివారం నాడు మీడియా జర్నలిస్టుల పై మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బంది మరియు బౌన్సర్లు దాడి చెయ్యడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా కండిస్తుందని అలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే కేవలం అరెస్టులు సరిపోవని కావున అరెస్టు చేసి జైలుకు పంపాలని నేడు మీడియా మిత్రులతో పాటు పెటబషీర్బాగ్ డీసీపీ ని కలిసి సిపిఐ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.

ఆసుపత్రిలు,కళాశాలలు,పాఠశాలు రక్షణ పేరిట రోగులు, తల్లితండ్రులు భయపడేలా వాటి ఆవరణలో బౌన్సర్లను పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని,ఏదైనా జరిగితే స్థానిక పోలీసు వారికి చెప్పాల్సింది పోయి వారే చట్టాన్ని చేతిలోకి తీసుకొని భౌతిక దాడులకు దిగుతున్నారని కాబట్టి ఇలాంటి వారిని,వారి యాజమాన్యాలను కూడా అరెస్టు చేసి జైలుకు పంపిస్తే తప్ప నేరస్తులు బయపడేలా లేరని,రెండు ముడు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉండటం వల్ల ఎలాంటి భయం ఉండట్లేదని కావున వెంటనే అరెస్టు చెయ్యాలని అన్నారు.

అలాగే స్వయంగా డాక్టర్లే వారి నిర్లక్ష్యం వల్ల మహిళా మరణించిందని ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆ యాజమాన్యం,ఆసుపత్రి పై చర్యలు తీసుకోకపోవడం మెడికల్ ఆఫిసర్ నిర్లక్ష్యం దారుణమని వెంటనే ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాల్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App