తెలంగాణలో 15నెలల చిన్నారికి కరోనా

TRINETHRAM NEWS

తెలంగాణలో 15నెలల చిన్నారికి కరోనా

తెలంగాణ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 6 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 15నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు.

నాంపల్లి కి చెందిన చిన్నారికి జ్వరం, న్యుమోనియాతో బాధపడుతుండగా ఈ నెల 12వ తేదీన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తాజాగా చిన్నారికి కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ అని నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని నిలోఫర్ వైద్యులు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top