
Dr. Yekula Rajarao : దేవరకొండ డివిజన్ జూన్ 21, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో ఆదివారం గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన గోరటి రమణ- శ్రీను దంపతుల కుమార్తె హాసిని మరియు కుమారుడు లక్కీ ల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు హాజరై మెమొంటోను అందజేసి చిన్నారులను ఆశీర్వదించిన టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు .
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. హాసిని మరియు లక్కీలు ఉన్నత విద్యను అభ్యసించి, సంస్కారంతో , జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి, తిమ్మాపురం సర్పంచి స్వాతి ముత్యం, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం నాయకులు గోరటి అంజి, పంబాల పర్వతాలు, మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేపూరి మురళి, బయ్య శ్రీను, బయ్య శేఖర్, తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe