జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Today in History

Today in History : త్రినేత్రం న్యూస్ : చరిత్రలో ఈ రోజు జూన్ – 17

సంఘటనలు

1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.

1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.

1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).

1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.

1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.

1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.

1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.

1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.

1978: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.

1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.

1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.

ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డేజరుపుకుంటారు.

1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.

2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.‌‌

జననాలు

1239: మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307).

1682: చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718).

1913: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).

1973: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు .

మరణాలు

1631: ముంతాజ్ మహల్, ప్రసవ సమయంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 సంవత్సరాలు కష్టపడి నిర్మింపచేసాడు.

1858: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828)

1946: చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)

జాతీయ / దినాలు

ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం

జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)

బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page