
Police Warn People : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 16; చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, ధర్మాజీ గూడెం పోలీసులు ఆ మండల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రజలు తమ ఇళ్లకు తాళం వేయకుండా, కేవలం తలుపులు దగ్గరగా వేసి ఇంటి ముందే నిద్రిస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రాత్రి వేళల్లో దొంగలు ఇళ్లలోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదు తదితర విలువైన వస్తువులను దొంగిలిస్తున్నట్లు సమాచారం అందింది అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు తమ విలువైన బంగారు వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి దొంగతనాలను నివారించుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

