CPI : పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి–సీపీఐ

TRINETHRAM NEWS
CPI Petrol, diesel and cooking gas prices

CPI : డిండి గుండ్ల పల్లి మే 16, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో శనివారం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలనీ సిపిఐ డిండి మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనుక చారి డిమాండ్ చేశారు.

శనివారం డిండి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కంటే ముందు మన దేశంలో ఎలాంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ కొరతలేదని ప్రచారాలలో హంగు ఆర్భాటాలు చేసి ప్రసంగాలలో చెప్పిన ప్రధానమంత్రి మోడీ ఎలక్షన్స్ అయిపోయిన కొన్ని రోజులకే పెట్రోల్ డీజిల్ పైన మూడు రూపాయలు పెంచడం వంట గ్యాస్ 1100 చేయడం దేశంలోని ప్రజలందరినీ మోసం చేయడమే అని ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుడిపైన పెను భారం పడుతుందని ఈ అధిక భారం వల్ల సామాన్యుడు ఏది కొనలేని పరిస్థితి ఏర్పడిందని దేశాన్ని అంధకారంలోకి నెడుతున్న మోడీ ని గద్దె దించాలని తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల్లో తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిండి మండల సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. లేనియెడల భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ డిండి మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వలు,సిపిఐ మండలం కార్యవర్గ సభ్యులు కేశవులు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్,ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్,ఏఐటీయూసీ మండలం అధ్యక్షులు భూషిపాక లింగమయ్య సిపిఐ గోనకొల్ గ్రామశాఖ కార్యదర్శి రాగం వెంకటేశ్వర్లు,తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి,భూషిపాక గోవర్ధన్,కామెపల్లి ప్రవీణ్,నూనె నాగరాజు,భూషిపాక గంగయ్య వేముల లింగస్వామి,విభూది లక్ష్మయ్య,గోవు వెంకటయ్య, నూనె నిరంజన్,ఎడ్ల శ్రీను,కాంపల్లి లింగయ్య,విభూది కంటప్ప,విభూది నిరంజన్,ఆర్కపల్లి దేవయ్య,కళ్లెం అగ్గిరాములు,వేముల కుమార్,గాజుల శ్రీను,తాటికొండ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top