
డీసీసీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ
Resolve the Problems : త్రినేత్రం న్యూస్ : నూతనంగా పత్తికొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఒబులేసు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు రెవెన్యూ సంబంధిత సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు.
దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామ వంతెన నిర్మాణం మరియు పత్తికొండ ప్రధాన రహదారి వెడల్పు వంటి సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ముఖ్యంగా భూ సమస్యలు, పట్టాదారు పాస్‌బుక్లు, సర్వే పెండింగ్ అంశాలు, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో జాప్యం వంటి సమస్యలను చర్చించి, వాటిని దశలవారీగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

