YSRCP Demands : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొలగించాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్

TRINETHRAM NEWS
YSRCP demands that TTD Chairman BR Naidu

YSRCP Demands : త్రినేత్రం న్యూస్… తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బాలాజీపేట సెంటర్‌లో తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రముఖ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి, టీటీడీ పవిత్రతను కాపాడాలని ప్రార్థించారు.
నాయకులు మాట్లాడుతూ—బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలి వల్ల టీటీడీ పవిత్రత దెబ్బతింటోందని ఆరోపించారు. ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
వారి డిమాండ్లు: బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి… టీటీడీ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గోందేశీ శ్రీనివాసరెడ్డి, నక్క రాజబాబు, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, పెయ్యల రాజేష్, చాప రాజా, చింతపర్తి రాంబాబు, పుచ్చ గోవింద్ రెడ్డి, బొమ్మ శీను, పగడం లక్ష్మణరావు, దేవులపల్లి సరిత రాణి, సయ్యద్ రుఖియా, వెలగల కళ్యాణి రెడ్డి, పట్టపగలు వెంకట లక్ష్మి, పసుపులేటి దేవి, కోమిరిశెట్టి ధనమ్మ, పుచ్చ ప్రసన్న, సద్గుణ రామారెడ్డి, చోల్లంగి సత్యగిరి, దాసరి ధర్మ, ఓడూరి రామకృష్ణ, అయినవిల్లి వెంకటేశ్వరరావు, మోత పావనమూర్తి, చిలుకూరి రామకృష్ణ, పున్నమరాజు వీరాజు, కంభం సుబ్బారెడ్డి, దాకే శ్రీను, పరిమళ నాని, పరిమళ బాబీ, కోటిపల్లి రవి, బీధం రాజు, చీరా రాజు, నాగిరెడ్డి మోహన్, తోడేటి రాజా, తోడేటి రాహుల్, సర్కార్ బాషా, కోల్లి వెంకటరత్నం, మరదాపు శేఖర్, శిరసపల్లి శంకరరావు, దారపు రామకృష్ణ రెడ్డి, కడలి రాంబాబు, కోల్లి నానీబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top