
Chandana Nageshwar : త్రినేత్రం న్యూస్, కడియం, మార్చి 29 (2026): కడియం అరుంధతి పేటలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సమస్త సామగ్రి కాలి బూడిద అయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబుతో కలిసి ఆదివారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ బాధిత కుటుంబానికి ₹10,000 నగదు సహాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, సంబంధిత అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

