Ramavat Ravindra Kumar : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

TRINETHRAM NEWS
Ramavat Ravindra Kumar Congress government has completely failed

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం
నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

Ramavat Ravindra Kumar : దేవరకొండ దుర్గం మార్చ్ 29, త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ పట్టణానికి చెందిన 20మంది బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు.నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది అని ఆయన అన్నారు.ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు.మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు అని ఆయన గుర్తు చేశారు.ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది అని ఆయన తెలిపారు.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు అని ఆయన అన్నారు.పథకాల అమలు తక్కువ…

ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది అని ఆయన అన్నారు.ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు,వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు.

ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు.దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు అని,రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు అని ఆయన తెలిపారు.ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు అని,విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో పొందుపరిచలేదు అనిఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది అని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా 20 వేల కోట్లకు మించకుండా కేటాయించడాన్ని ప్రశ్నించారు.సంక్రాంతికి రావాల్సిన డబ్బులు ఉగాది దాటినా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.పార్టీలో చేరిన వారిలో సంధ్య,అనిత, అనిల్,రమేష్,రాజు,శివ,వినయ్, తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విరమోని అంజి గౌడ్,పొట్ట మధు, కేతావత్ రుప్లా నాయక్, పొట్ట మురళి, పులిజాల జానీ,బొడ్డుపల్లి కృష్ణ, జమీర్ బాబా, లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top