VBG Ramji Bill : విబిజి రాంజీ బిల్లు రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

TRINETHRAM NEWS
VBG Ramji Bill should be repealed

తెలంగాణ వ్యవసాయగ్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్

VBG Ramji Bill : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. ఉపాధి కూలీల శ్రమను దోపిడీ చేస్తున్న వి బి జి రాంజీ బిల్లు రద్దు చేసి గతంలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం రోజున కొండ మల్లేపల్లి మండలంలోని గాజి నగర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.
చేసిన పనులకు వారం వారం వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నగత ఏడు వారాలుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు అందలేదని వెంటనే ఇవ్వాలని, పని ప్రదేశాలలో భూమి గట్టిగా ఉండటం వల్ల కూలి గిట్టుబాటు కావట్లేదు తెలిపారు. ఉపాధి కార్మికుల పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అలాగే చట్టం లేకుండా చేసే దురుద్దేశాన్ని తిప్పి కొట్టాలని కూలీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు జాతీయ ఉపాధి హామీ చట్టంలో కార్మికుల సంక్షేమం కోసం ఉన్నటువంటి సౌకర్యాలను ఈ వీబీజీ రాం జి చట్టంలో పూర్తిగా తొలగించి కార్మికులకు నష్టం చేస్తుంది.

గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిదలు కేటాయించింది కొత్తగా బిజెపి చేసిన చట్టంలో 90% నిధులు నుండి 60% కుదించింది .మిగతా 40% నిధులు ఆయా రాష్ట్రాలు భరించాలని చెప్పి ఉపాధి కల్పించే బాధ్యతనుండి క్రమంగా బీజేపీ ప్రభుత్వం తప్పుకుంటుంది అన్నారు. పది సంవత్సరాలుగా ఉపాది కూలీలకు బడ్జెట్లో కోతలు విధించుకుంటూ వస్తుంది.

లక్షల కోట్ల రూపాయలు దేశలోని బడా కార్పొరేట్ సంస్థలకి రాయితి ఇస్తు పదేమి చట్టానికి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం అన్యాయమని అన్నారు సంవత్సరానికి 125 రోజులు పని కల్పిస్తున్నామని ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. 95 వేల కోట్లతో 42 కోట్ల మంది ఉపాధి కార్మికులకు ప్రభుత్వం ఏ విధంగా 125 రోజులు పని కనిపిస్తుందని ప్రశ్నించారు?
125 రోజులు పనికి కల్పించాలంటే 3,50, లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుందని కానీ కేంద్ర ప్రభుత్వం 95 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలియజేశారు గతంలో సంవత్సరంలో ఎప్పుడైనా వంద రోజులు పని చేసుకునే అవకాశం కూలీలకు ఉండేది. ఈసారి అధికారికంగానే 60 రోజులపాటు ఉపాధిహామీ పనులు బంద్ చేయాలని చట్టంలో పేర్కొంది. గతంలో లో కార్మికుల సంక్షేమం కోసం పని ప్రదేశాలలో నీడకొసం టెంటు, త్రాగునీరు, మెడికల్ కిట్లు, మూడు కిలోమీటర్ల పై దూరంలో పనులు చేస్తే ట్రాన్స్పోర్ట్ చార్జీలు, పనిముట్లు తదితర సౌకర్యాలు ఉండేవి, ఈ కొత్త చట్టంలో ఈ సౌకర్యాలని తొలగించిందని తెలిపారు
రాంజీ చట్టాన్ని రద్దు చేసే వరకు కార్మికులంతా కలిసి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికార యంత్రం వెంటనే పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు కావలి కృష్ణయ్య సంఘం గ్రామ కమిటీ సభ్యులు బుడిగపాక అంజమ్మ బత్తుల అంజమ్మ సుక్కమ్మ సాలమ్మ విజయ జక్కమ్మ చంద్రకళ ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top