
బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్
Ramavat Ravindra Kumar : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ మాల్ గడ్డ ముత్యాలమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలంలోని మాల్ గడ్డ ముత్యాలమ్మ తల్లినీ బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఈ ప్రాంత ప్రజలు ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ,అంజి, అంజయ్య ,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

