MLA Nenavath Balu Naik : క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

TRINETHRAM NEWS
Special priority for the development of sports

MLA Nenavath Balu Naik : చింత పల్లి మార్చ్ 27, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం మొద్గుల మల్లేపల్లి గ్రామంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…,

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్‌ల ద్వారా గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి వేదిక లభిస్తుందని, ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.
అలాగే శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడాస్ఫూర్తితో పోటీలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్, మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, మండల అధ్యక్షులు నాగభూషణం, ముచర్ల గిరి, వెంకటయ్య గౌడ్, రవిశంకర్ రెడ్డి, హరినాయక్, జంగిటి నర్సింహా, మల్లేష్ యాదవ్, నగేష్, మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top