Minister Damodar Rajanarasimha : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను ఐక్యవేదిక ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు

TRINETHRAM NEWS
Medical and Health Minister Damodar Rajanarasimha was felicitated

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు బిల్లును అసెంబ్లీ లో ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

Minister Damodar Rajanarasimha : త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా : వైద్య విధాన పరిషత్ 1986 సంవత్సరంలో ఏర్పాటు చేశారు దాని రద్దుచేసి స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు బిల్లును ఈ రోజు అసెంబ్లీ ఆమోదించడంతో చిరకాలంగా ఇందుకోసం పోరాటం చేసిన వైద్యులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకోసం గతంలో అనేకసార్లు పోరాటాలు ,ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి.

వైద్య, ఆరోగ్య శాఖ లోని ఇతర విభాగాల లాగానే ప్రజలకు అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించక పోవడంతో పాటు అనేక విధాలుగా వివక్షకు గురి పోతున్నామని, ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని అన్ని సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పోరాటం ఇప్పటి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని అమలు చేయడం వరకు పట్టుదలగా, ప్రజలకు ఇబ్బందులు కలిగించని పోరాట రూపాలతో ఉద్యమాలు కొనసాగించి చివరి కు విజయం సాధించాము విరామాలు,విభేదాలు తలెత్తినప్పటికీ అవేవీ తమ లక్ష్య సాధనకు ఆటంకం కలిగించకుండా విజయం సాధించిన ఐక్య వేదికల నాయకులకు, ప్రభుత్వానికి,ముఖ్యంగా సమస్యను సానుభూతితో అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కమిషనర్ డాక్టర్.

అజయ్ కుమార్ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరూ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు. ఈ నిర్ణయం తో ప్రజలకు అందే వైద్య సేవల్లో కూడా మౌలికమైన మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.వివిధ కేడర్ ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తో తమ లక్ష్యాన్ని సాధించుకున్న సంతోషంలో ప్రతి ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదే స్పూర్తి తో శాస్త్రీయమైన కేడర్ స్ట్రెంగ్త్ ఏర్పాటుకు కృషి చేసి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ప్రస్థానం ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.

వినయ్ కుమార్ చైర్మన్ గా, శ్రీ సోమ మల్లన్న కన్వీనర్ గా మొదలు పెట్టిన ఈ ప్రస్థానం టీ.జీ.డీ.ఏ నాయకులు డాక్టర్. రవూఫ్ , మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సత్య నారాయణ రెడ్డి, మాదాసు శ్రీనివాస మూర్తి, వీరేశ్ బాబు, కరుణాకర్,నర్సింగ్ అసోసియేషన్ నాయకులు వట్టి మరియమ్మ,ఆదిలక్ష్మి, ఫార్మసిస్ట్ యూనియన్ నాయకులు పాండు , పరాబ్ కుమార్, రామారావు, అమృత రావు, టీ.ఎన్.జీ.ఓ. నాయకులు శైలజ,క్రిస్టోఫర్, డేవిడ్, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బైరపాక శ్రీనివాస్, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ నాయకులు ఆంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top