
AR Constables Family : త్రినేత్రం న్యూస్ : Mar 23, 2026, హైదరాబాద్: ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 1.05 కోట్ల బీమా చెక్కు అందజేత… ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బి. రామానాయుడు కుటుంబానికి రూ. 1.05 కోట్ల బీమా డబ్బులను డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు సోమవారం అందజేశారు.
రామానాయుడు సోదరుడు బోయ బీచుపల్లికి డీజీపీ కార్యాలయంలో ఈ చెక్కును అందించారు. రాష్ట్ర పోలీస్ శాఖతో బ్యాంక్ ఆఫ్ బరోడా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ప్రమాదంలో మరణించిన ఉద్యోగులకు ఈ బీమా సౌకర్యం కల్పిస్తారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రామానాయుడు మరణించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నార్కెట్పల్లి బ్రాంచ్లో ఆయన జీతం ప్యాకేజీ జమ అవుతుందని, బీమా క్లెయిమ్ వెంటనే ప్రాసెస్ చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

