Bhagat Singh : డిండి లో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

TRINETHRAM NEWS
Bhagat Singh death anniversary

Bhagat Singh : డిండి (గుండ్ల పల్లి),మార్చి 23, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో లోని సిపిఐ ప్రజాభవన్ లో సోమవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల95 వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు సిపిఐ మండల సహాయ కార్యదర్శి శైలేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యనమల నవీన్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు వినయ్ కుమారులు మాట్లాడుతూ . నేటి యువత కుల, మత రాజకీయాలను ప్రోత్సహించకుండా భగత్ సింగ్ ఆశించిన సమాజ నిర్మాణం కోసం ,యువత నడుం బిగించాలని వారన్నారు. అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజల హక్కులను కాపాడబడతాయని అదే వారికిచ్చే ఘనమైన నివాళులు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాంపల్లి శ్రీకాంత్, కళ్లెం సిద్దు, ఎండి ఆదిల్, నూతన కంటి ఆంజనేయులు, వెల్తూరి నాగార్జున్ ,వెంకటేష్ ,నవీన్, చంద్రయ్య ,శ్యామ్ ,రేనయ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top