
10th Class Exams : డిండి (గుండ్ల పల్లి ) మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. డిండి మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నడుస్తున్నట్లు మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. డిండి మండలవ్యాప్తంగా ఇంగ్లీష్ (ఆంగ్ల) పరీక్షకు 376 మందికి 374 మంది హాజరైనట్టు తెలిపారు.
ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో176 మందికి గాను 175 మంది విద్యార్థులు హాజరయ్యారని , తెలంగాణా గ్రామీణ మోడల్ స్కూల్ నందు200 మందికి గాను 199, మంది విద్యార్థులు హాజయ్యారనీ, మొత్తం 376 మందికి 374 మంది హాజరైనట్టు మండలవిధ్యాధికారి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డిండి ఎస్ ఐ, సీ హెచ్ , బాల కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

