Helicopter Crashes : ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాఫ్టర్

TRINETHRAM NEWS
Helicopter crashes while landing

Helicopter Crashes : త్రినేత్రం న్యూస్ : నేపాల్ : శవాన్ని తరలిస్తున్న ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పంట పొలాల్లో ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి నేలపై కుప్పకూలిపోయింది. ఈ సంఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎయిర్ డైనస్టీకి చెందిన ఓ హెలికాప్టర్ బుధవారం ఉదయం ఖాట్మండు నుంచి ఖోతంగ్‌కు శవాన్ని తరలించింది. హెలికాప్టర్ గమ్య స్థానం చేరుకున్న తర్వాత కొండ ప్రాంతంలోని పంట పొలాల్లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే, ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ అదుపుతప్పింది.

ఒక్క సారిగా నేలపై పడి ధ్వంసం అయింది. రెండు ముక్కలుగా విరిగిపోయింది. లోపల ఉన్న ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పరుగు, పరుగున హెలికాఫ్టర్ దగ్గరకు చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనపై ఖోతంగ్ జిల్లా అధికారి రేఖ కందెల్ మాట్లాడతూ.. ‘పంట పొలంలో ల్యాండ్ అవుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ హెలికాప్టర్ ఖాట్మండు నుంచి ఓ శవాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది’ అని అన్నారు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో బంధించాడు. వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. విమానాలను చూస్తేనే భయం వేస్తుంది’..‘జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో ఫిబ్రవరి నెలలో ఏకంగా ఏడుగురు చనిపోయారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top