త్రినేత్రం న్యూస్ : Mar 14, 2026, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఆదివారం నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది.


