Digital Health Card for Women త్రినేత్రం న్యూస్ : Mar 11, 2026, తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళలకు రక్తహీనత, మధుమేహం, బీపీ, క్యాన్సర్ వంటి 30 రకాల వ్యాధులను గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు.
ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా రికార్డు చేసి, ప్రత్యేక IDతో హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి ప్రారంభమైన ఈ స్క్రీనింగ్, మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


