Trinethram News : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మృతి చెందారని లేదా గాయపడ్డారని ఇరాన్‌కు చెందిన టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఒక నివేదికలో ఊహాగానాలు వ్యక్తం చేసింది..
ఇటీవలి రోజులుగా నేతన్యాహు ప్రజల ముందుకు రాకపోవడం, వీడియో సందేశాలు కనిపించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం..
అయితే ఈ వార్తలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. అందువల్ల ఈ సమాచారం ప్రస్తుతం కేవలం ఊహాగానాలుగానే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి..
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వేగంగా ప్రచారం అవుతున్నాయి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


