నంద్యాల జిల్లా : మార్చి 9: (త్రినేత్రం న్యూస్); ఆ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడు నని తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ కాలంలో తీవ్రవాదులు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తనపై దాడి జరిగిందని , చంపాలని చూశారని పేర్కొన్నారు.
అదే సమయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తనకు ప్రాణం బిక్ష పెట్టాడని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదం వల్లనే తాను బతికి బయటపడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


