శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
చింత పల్లి మార్చ్ 08, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో నిర్వహించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన అన్నారు.శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని అని ఆయన కోరారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, కొండూరు శ్రీనివాస్, మల్లోజు జగన్, బద్దేపల్లి పులిరాజ్ గౌడ్, నిరంజన్ గౌడ్, పోచయ్య, శ్రీనివాస్ చారి,జగన్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


