Trinethram News : చిలకలూరిపేట రూరల్: మండల పరిధిలోని పసుమర్రు మరియు బొప్పిడి గ్రామాల్లో దీపావళి బాణసంచా దుకాణాలు, గూడాల తనిఖీ ప్రక్రియ గురువారం ఉదయం నుండి ప్రారంభమైంది. నిబంధనల మేరకు బాణసంచా నిల్వలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొన్నటి తనిఖీల్లో భాగంగా అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీలు వీటిని పరిశీలించి, తాళాలను తమ ఆధీనంలోకి తీసుకోగా, నేడు అధికారికంగా తనిఖీలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పీతో పాటు, మండల తాసిల్దార్ షేక్ హుస్సేన్, రూరల్ ఎస్సై అనిల్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


