Rambabu discusses Security : మురమండలో శ్రీ సర్వకామదాంబ సమేత సోమేశ్వర స్వామి రథోత్సవం – భద్రతా చర్యలపై సీఐతో రాంబాబు చర్చ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మురమండ గ్రామంలో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత సోమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన భద్రతా చర్యలపై మన మురమండ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ళ రామ్మోహన్ (రాంబాబు), స్థానిక సీఐ అల్లు వెంకటేశ్వరరావు గారితో చర్చించారు.
రథోత్సవ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకల సౌకర్యం, అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచడం, యువత వాలంటీర్లను నియమించడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించగా, కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని సీఐ హామీ ఇచ్చారు.
భక్తులు కూడా పోలీస్ సూచనలు పాటిస్తూ రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rambabu discusses security measures with CI

You cannot copy content of this page

Scroll to Top