పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి… అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన పి. ఓదెలు తనకు ఖానాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 48/38 లో వారసత్వంగా ఒక ఎకరం భూమి ఉందని, ఆ భూమి మరణించిన తన తండ్రి గారి పేరు మీద ఉందని, అట్ట భూమి తన పేరు మీద మార్చి పట్టా పాస్ పుస్తకం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ మంథని కు రాస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ కు చెందిన బి. శ్యామల తనకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీ.డీ. హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి పట్టణం రంగంపల్లి కు చెందిన కే.కవిత తమ దివ్యంగులమని ఆ కోటాలో తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీ.డీ. హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాకు చెందిన బానోతు రాజేష్ నాయక్ సీఎం కప్పు క్రీడా పోటీలలో తన కుమారుడు బానోతు రెడ్యా నాయక్ కు గాయాలయిందని, అతని చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డివైఎస్ఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


