Congress Wins : వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. వికారాబాద్ మున్సిపాలిటీ టౌన్‌లో కాంగ్రెస్ పార్టీకి 52% పైగా ఓట్ షేర్ వస్తుందని, ప్రత్యర్థి పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్ లకు ఇక్కడ తమతో పోటీ పడే శక్తి లేదనిమాజీ జెడ్పిటిసి, పట్లోల్ల మైపాల్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ , లు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చానల్ కు ఇంటర్వ్యూకు ఇస్తూ వారు మాట్లాడుతూ..
వికారాబాద్ అభివృద్ధి కోసం హెచ్.ఎమ్.డి.ఏ నుండి రూ. 250 కోట్లు, టి.యు.ఎఫ్.ఐ.డి.సి ద్వారా రూ. 100 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ, ఒక్కొక్క ఇంటికి రూ. 5 లక్షల చొప్పున దాదాపు 2,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు మెరుగుపడలేదని, తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. టూరిజం అభివృద్ధి కొరకు అనంతగిరి గుట్టను మెగా కృష్ణా రెడ్డి కంపెనీ సహకారంతో భారీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, సుమారు 2,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
వికారాబాద్‌లో 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాల నమూనాలతో కూడిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, దీని నిర్వహణ బాధ్యతలను ఈషా ఫౌండేషన్‌కు అప్పగించే ఆలోచన ఉందని తెలిపారు.
ఆర్థిక వృద్ధి: పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల వికారాబాద్‌లో వ్యాపారాలు పుంజుకుంటాయని, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress wins Vikarabad Municipal Chairman's seat

You cannot copy content of this page

Scroll to Top