త్రినేత్రం వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంద నీ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్య గెలుపే లక్ష్యంగా మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పసియోధిన్, రాచన్న, నర్సింలు యాదవ్,మహేష్ లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ ,ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా వికారాబాద్ మున్సిపల్ పరిధి అంతటా నిర్విరామంగా గడపగడపకు ప్రచారం కొనసాగుతోంది.
ఈ ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్ లోని 31వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ గౌడ్ తరఫున కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని తెలిపారు. వికారాబాద్ మున్సిపల్‌లోని 34 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ఉధృతంగా సాగిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోడే సాధ్యమవుతుందని అధికార పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని వారు ఓటర్లకు వివరించారు. వికారాబాద్ మునిసిపల్ లో గడ్డం అనన్య చైర్మన్ అవడం ఖాయమని వారు స్పష్టం చేశారు.ప్రజా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ విజయం అనివార్యమని, వికారాబాద్ మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.
చైర్మన్ పీఠంపై గడ్డం అనన్య కూర్చోవడం ఇక కాలప్రశ్న మాత్రమేనని తెలిపారు.ఈ సందర్భంగా వికారాబాద్‌లోని రామయ్యగూడ రోడ్ లో ఉన్న దర్గా వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం మల్లికార్జునగౌడ్ తో కలసి ప్రత్యేక పాతేహాలు పాటించి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ ఎత్తున విజయం సాధించాలని ప్రార్థనలు నిర్వహించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


