ఆదర్శప్రాయుడు సత్యనారాయణ.
మండల విద్యాధికారి గోప్యా నాయక్.
డిండి ( గుండ్ల పల్లి )జనవరి 31 త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి (డిండి )మండల పరిధిలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన సోషల్ స్టడీస్ కాంప్లెక్స్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జూలై 2026లో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ కు తోటి ఉపాధ్యాయులు ముందస్తు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఇస్లావత్ గోప్యా నాయక్ మాట్లాడుతూ.. సత్యనారాయణ తన 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. గుండ్లపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు చెందిన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులందరూ కలిసి ఆయనను గౌరవించుకోవడం వారి మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
సీనియర్ ఉపాధ్యాయులకు గౌరవం సత్యనారాయణతో పాటు సమావేశంలో పాల్గొన్న ఇతర సీనియర్ సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం కలిగిన వారిని గౌరవించుకోవడం ద్వారా యువ ఉపాధ్యాయులకు స్ఫూర్తి లభిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
పాల్గొన్న ముఖ్యులు:—
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మాజీ ఎంఈఓ ఇస్లావత్ సామ్య నాయక్, దామోదర్ రెడ్డి, మాజీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఇస్లావత్ మల్లేశ్వర్ నాయక్, లాలు నాయక్, నర్సయ్య, అనిత, జిలేఖా బేగం, శాంతి.
కాంప్లెక్స్ ఆర్పీలు: — భూక్య
నాగేశ్వరరావు, పగిళ్ళ పుష్పలత.
డీఆర్పీ: దొడ్డ ఆంజనేయులు.
ఉపాధ్యాయులు: తిమ్మాపూర్ ఎంపీపీఎస్ హెడ్మాస్టర్ రవి, జమాల్ బాబా, ఎల్లయ్య, స్వప్న, సంధ్యారాణి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


