జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) జనవరి 31 త్రినేత్రం న్యూస్. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సర్పంచ్ నల్లగంతుల రవి అన్నారు. శనివారం డిండి మండల కేంద్ర ప్రైమరీ స్కూల్ ను సర్పంచ్,ఎంఈఓ తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు చదువు,ఆటల్లో రాణించాలని అన్నారు. కాలానికి అనుగుణంగా విద్యార్థులు ముందుండాలని అన్నారు. అనంతరం స్కూలు ఉపాధ్యాయులకు ఎంఈఓ కుర్చీలను అందించడం జరిగింది.

సాయంత్రం ట్యూషన్ వుండే విద్యార్థులకు సర్పంచ్ స్నాక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామారావు , ఉపాధ్యాయులు బుజ్జి రాణి, షహీన్,తరుణ్, సందీప్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Quality education should be provided to students

You cannot copy content of this page