అరకులోయ జనవరి 31, (త్రినేత్రంన్యూస్): అరకు ఫెస్ట్ వేడుకల్లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా చొంపి కొత్తవలస గార్డెన్ వద్ద హెలికాప్టర్ మరియు పెరామోటింగ్ రైడ్స్‌ను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో పాటు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ప్రాజెక్టు అధికారి, సహాయ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి తిరుమణి శ్రీపూజ హెలికాప్టర్లో విహరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “అరకు ఫెస్ట్ ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఆకాశ వీధిలో విహరించే అవకాశం కల్పించాం. ప్రకృతి అందాలను ఆకాశం నుంచి చూసే అరుదైన అనుభూతి ఇది” అని అన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
టికెట్ ధరలు ఇలా.. హెలికాప్టర్ రైడ్: ఒక్కొక్కరికి రూ. 4000/- పెరామోటింగ్: ఒక్కొక్కరికి రూ. 2500/- ఈ టికెట్లు ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయని, ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అరకు ఫెస్టుకు వచ్చిన పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రత్యేక అనుభూతిని తప్పకుండా ఆస్వాదించాలని అధికారులు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


